Are you an artist? Make the most of your lyrics with Musixmatch Pro!
Verified by Curator
2 contributions
over 4 years ago
Translations
Telugu-romanized

Lyrics of Neevevvaro by G.V. Prakash Kumar, Saindhavi & Siddharth

నీవెవ్వరో నీవెవ్వరో
నే చూడని నా ఊపిరో
ఈ మగువనే గెలిచావురో నచ్చావురో
నీవెవ్వరో నీవెవ్వరో
నే చూడని నా ఊపిరో
ఈ మగువనే గెలిచావురో నచ్చావురో
నీ చూపులే నను లాగెనో
ఈ ప్రేమలో ముంచేసెనో
నీ అడుగులో ఓ నీడలా నడిపించెనో
చిరుఎండలో జడివానవో
తెలిమంచులో చలిమంటవో
కనుసైగతో మనసెరిగిన తొలిప్రేమవో
ఏవైపుగా ఎగిరెళ్లనే ఆ నింగిలో నీతో ఇక
నీ గుండెలో కొలువుండని నా ప్రాయమే ఈడేరగా
దూరాలు సెలవని తొలగెనులే
నెమ్మదిగ మనసులు కలిసెనులే
నీ వేలితో నా వేలికే చెలిమాయెలే
నీవెవ్వరో నీవెవ్వరో
నే చూడని నా ఊపిరో
ఈ మగువనే గెలిచావురో నచ్చావురో
నీ శ్వాసలే నను తాకగా నా సిగ్గులే చితికాయిలే
నీ పరిమళం నను చేరగా నా తలపులే శృతిమించెలే
మనసిలా పడవగ మారెనులే
అలజడికి అటు ఇటు ఊగెనులే
దరిచేరునో నీ ఒడిచేరునో ఎటు సాగునో
నాకోసమే వచ్చావురో కనురెప్పలా కాచావురో
ఈ మగువనే గెలిచావురో నచ్చావురో
చిరుఎండలో జడివానవో
తెలిమంచులో చలిమంటవో
కనుసైగతో మనసెరిగిన తొలిప్రేమవో
Writer(s): Vanamali, G.v. Prakash Kumar

Contribute

To-do

Structure Tag
Identify the song's sections

Completed

Lyrics
Verified by Curator
Performers Tag
Identify who's singing what

Credits

Show all credits

Contributions

Last edit over 4 years ago
Are you an artist? Distribute your lyrics!
Take full control of your lyrics. Curate, sync, and distribute your lyrics on Spotify, Apple Music, and more.
Explore Musixmatch Pro